NEET 2026 Re Exam
* జూన్ 21న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
ఆకేరు న్యూస్ కమలాపూర్:
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ 2026 పునఃపరీక్ష సంబంధించిన కీలక ప్రకటనను తాజాగా విడుదల చేసింది.ఎలాంటి లోపాలకు తావులేకుండా, అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలతో పరీక్షను సజావుగా నిర్వహించాలని విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై డిమాండ్ పెరిగిన దృష్ట్యా NEET 2026 పునఃపరీక్ష జూన్ 21, 2026 ఆదివారం న నిర్వహించనున్నట్లు సామాజిక వేదిక ఎక్స్ లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది అభ్యర్థులకు ఊరట నివ్వనుంది.
ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో, పారదర్శకతను కాపాడేందుకు ఈ పునఃపరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థులు వారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో, వాట్సాప్లో వచ్చే అనధికారిక వార్తలను నమ్మవద్దని, కేవలం NTA అధికారిక వెబ్సైట్లోని సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ఏజెన్సీ స్పష్టం చేసింది.
సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు neet-ug@nta.ac.in ఈమెయిల్ ద్వారా లేదా 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపింది. అయితే, కొత్త తేదీ ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల కేటాయింపు, ప్రయాణ సౌకర్యాలు, ఇతర పోటీ పరీక్షలతో తేదీలు కలవడం వంటి అంశాలపై కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
