* రైల్లో మంటలు అనడంతో ట్రాక్‌పైకి దూకిన ప్రయాణికులు
* అదే సమయంలో.. అదే ట్రాక్‌పైకి రైలు
* రైలు కిందపడి ముగ్గురి దుర్మరణం
ఆకేరు న్యూస్ డెస్క్ : ‘రైల్లో మంటలు.. రైల్లో మంటలు..’ అంటూ కొందరు ఆకతాయిలు రేపిన పుకార్లు ముగ్గురు ప్రయాణికుల ప్రాణం తీశాయి. తొక్కిసలాటకు దారి తీసింది. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జార్ఖండ్‌లోని (Jharkhand) ధన్‌బాద్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రాంచీ – ససరం ఇంటర్సీటీ ఎక్స్‌ప్రెస్ (Ranchi – Sasaram Intercity Express) రైలులో మంటలు వ్యాపించాయని పుకారు లేవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు ప్రాణాలు రక్షించుకోవడానికి పక్కనున్న పట్టాల మీదకి దూకారు. అదే సమయంలో ట్రాక్ మీదుగా గూడ్స్‌రైలు రావడంతో దాని కింద పడి దుర్మరణం పాలయ్యారు. కుమంద్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు చనిపోగా, కొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
——————–