ఐఏఎస్ కూతురికి అక్కడే విధులు నిర్వహిస్తున్న తండ్రి బొకే ఇచ్చి సెల్యూట్ చేసారు
* తెలంగాణ పోలీసు అకాడమీలో అరుదైన దృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏడుగురు సభ్యులు గల ఐఏఎస్ ప్రొబేషనర్ల బృందం కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటేరియట్‌ను సందర్శించింది. ట్రైనీ ఐఏఎస్ లైన అధికారులు సీసీటీవీ కెమెరాల పనితీరు, కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యకలాపాలు, ఇతర అంశాలను అధ్యయనం చేశారు. అనంతరం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం తెలంగాణ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అధికారిక విధుల్లో భాగంగా ఓ తండ్రి తన కూతురికి సెల్యూట్ చేశారు. ట్రైనీ ఐఏఎస్‌గా వచ్చిన తన కూతురికి అక్కడే డీడీగా విధులు నిర్వహిస్తున్న తండ్రి పూలబొకే ఇచ్చి సెల్యూట్ చేశారు. వికారాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమాహారతి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రొబేషన్‌లో భాగంగా శిక్షణలో పాల్గొనేందుకు శనివారం ఆమె తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)ని సం దర్శించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు ఉమాహారతి అక్కడికి రావడంతో చిరునవ్వు నవ్వుతూ ఆమె కు పూలబొకే అందజేసి సెల్యూట్ చేశారు. ఇది చూసి అక్కడివారంతా ఉద్విగ్నానికి లోనయ్యారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
