Station Ghanpur Power Supply Issue
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తెగిపోయిన కేబుల్ మార్చండి.. అతి తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించి ఆరు నెలలుగా ఆగిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ప్రమాదాలను నివారించాలని విద్యుత్ వినియోగదారుడు చింతకుంట్ల ఉపేందర్ రెడ్డి విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పుట్టలమ్మ కుంట వద్ద ఉన్న వ్యవసాయ భూమిలో 35, 27, 1424 సర్వీస్ నంబర్లతో మూడు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ఈ మూడు మోటార్లకు ఎస్ ఎస్ 2 ట్రాన్స్ఫార్మర్ నుండి గత 40 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. కానీ ఇటీవల ఇందిరానగర్ వద్ద రోడ్డు క్రాసింగ్ కేబుల్ చెడిపోయి, జంపర్లు కట్ అయిపోయి గత ఆరు నెలల నుండి మా మోటార్లకు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని మీ సిబ్బంది దృష్టికి తెచ్చిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా పుట్టలమ్మ చెరువు కట్ట కింద ఒక పాఠశాలతోపాటు మా ఇంటికి విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు
ఏర్పాటుచేసిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కోసం వేసిన లైన్ చాలా క్రిందికి వేలాడుతున్నది, వదులుగా ఉన్న ఈ లైన్ క్రింది నుండి స్కూల్ బస్సులు, గడ్డి ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు వచ్చి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ స్కూలుకు వెళ్లే దారి పక్కన తక్కువ ఎత్తులో ఉండడం వల్ల పిల్లలు, మనుషులు, పశువులు తాకే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించి పై సమస్యలను పరిష్కరించాలని వినియోదరుడు ఉపేందర్ రెడ్డి కోరుతున్నారు.
