Kadiyam Srihari &Dr. Rajayya Telangana Formation Day
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పేద ప్రజల సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికవృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బలిదే వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, సురేష్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
” మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్, రాధాకృష్ణ వ్యవసాయ మార్కెట్లో చైర్ పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, కార్యదర్శి భాస్కర్. ఎంపీడీవో కార్యాలయంలో విజయశ్రీ, మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ స్వప్న ఏసిపి కార్యాలయంలో ఏసిపి భీమ్ శర్మ, స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ వేణు, ఎస్సైలు వినయ్ కుమార్, రాజేష్, మనీషా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
” టిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య జాతీయ జెండా తో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్శి రంగారావు, చింతకుంట్ల జగన్ రెడ్డి, ఇనుగాల నరసింహారెడ్డి, మాచర్ల గణేష్, కనకం గణేష్, తాటికొండ సురేష్, చందర్ రెడ్డి, పావని, వీరా సింగ్, గుండా మల్లేష్, తోట సురేందర్, మారపల్లి ప్రసాద్ తదితరులు రాష్ట్ర అవతరణ దినోత్సవం లో పాల్గొన్నారు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
