Sharifuddin Suspicious Death Case
ఆకేరు న్యూస్, హనుమకొండ:
ఫోన్ వచ్చింది… బయటకు వెళ్లి శవం అయి కనిపించాడు.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబం సభ్యులు. నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్ (35) అనుమానాస్పద మృతి..
* వెల్లంపల్లి రోడ్ క్రాస్ వద్ద జరిగిన ఘటన..
మహమ్మద్ షరీఫుద్దీన్ భార్య ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శిగా చిట్యాల మండలంలోనీ కైలాపూర్ లో విధులు నిర్వహిస్తోంది. ఉద్యోగ రీత్యా భార్య, భర్త మూడు నెలల పసికందుతో కలిసి పరకాలలో అద్దె గదిలో నివాసం..
మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షరీఫుద్దీన్కు ఓ ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన షరీఫుద్దీన్..
మూడు నెలల పసికందును, భార్యను వదిలి షరీఫుద్దీన్ అకాల మరణం చెందడంతో కన్నీరు మున్నిరవుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు..
రోడ్ ప్రమాదామా? హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
