* వయనాడ్ నుంచి తప్పుకున్న రాహుల్
* వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయబరేలీకే మొగ్గు జూపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతో ఉత్తర ప్రదేశ్లోని రాయబరేలీ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏది వదులుకుంటాడన్న ఆసక్తి ఉండేది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ అంశం పై చర్చించారు. అనంతరం వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటున్నాడని ఖర్గే ప్రకటించారు. వయనాడ్కు జరిగే ఉప ఎన్నికల్లో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని ఖర్గే చెప్పారు. కాగా వయనాడ్ ప్రజలకు కృతజ్క్షతలు, ఈ నియోజకవర్గంతో నా బంధం కొనసాగుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారు.