Shreyas Iyer T20 Captain
* శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్!
ఆకేరు న్యూస్, డెస్క్: టీమిండియా టీ20 జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
గత కొంతకాలంగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఈసారి జట్టులో చోటు దక్కలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్‌పై సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నట్లైంది.
ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన రికార్డు కలిగిన శ్రేయస్ అయ్యర్.. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ టీ20 అంతర్జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఇక జట్టులో “అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే” వంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బౌలింగ్ విభాగంలో “అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి” తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనున్న భారత్.. అనంతరం జూలైలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.
* పూర్తి జట్లు
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ సూర్యవంశీ.
