Bhatti Vikramarka Pallagutta Power Substations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రూ.60 కోట్ల 62 లక్షల వ్యయంతో నిర్మించిన 4 విద్యుత్తు సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, 3 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క నేడు పల్లగుట్టకు రానున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో రేపు జరగనున్న విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల వేదిక స్థల పరిశీలన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 60.62 కోట్ల విలువైన సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి మొదటి సారి నియోజకవర్గానికి వస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వేలేరు మండలం పీచరలో 132/33 కేవి సబ్ స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్ గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరియు చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమర్క శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలలో ఇళ్లపై నుండి వెళ్తున్న 33/11 కేవి, సర్వీస్ లైన్ల షిఫ్టింగ్ సమబందించిన సమస్యలను, అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలోని 132/33 కేవి సబ్ స్టేషన్ ను 220/132 కేవి సబ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని మంత్రిని కోరనున్నట్లు వేల్లడించారు. ఈ సబ్ స్టేషన్ల ఏర్పాటుతో నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 శాతం విద్యుత్ సమస్యలకు పరిష్కారం అయినట్లే అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా ప్రధాన ఉదేశ్యం అని తెలిపారు. ఒకే రోజు ఒకే చోట 7 సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరుగుతున్న సందర్బంగా నియోజకవర్గ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సర్పంచులు ఎనగందుల నరసింహారెడ్డి, మేనక సుధాకర్, లావణ్య మల్లారెడ్డి, శాతబోయిన రాజు సొసైటీ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, ఉప సర్పంచ్ రఫీ నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, గడ్డమీద సురేష్, రంజిత్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, సుధాకర్, వెంకటేశ్వర్లు, జక్కుల రాజయ్య, సాధం నరసింహులు విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
