Mulugu SP Sudheer Ramnath Kekan Drug Awareness Campaign
* గంజాయి, ఇతర మత్తు పదార్దాల సమాచారం అందించిన వారికీ 5,116 /-రూపాయల బహుమతి
– జిల్లా ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లావ్యాప్తంగా యువతీ, యువకులు,విద్యార్థులు మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలు కు బానిస కావద్దని గంజాయి ఇతర మత్తు పదార్థాల సమాచారం అందిస్తే వారికి 5,116/-నగదు బహుమతి అందిస్తామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తెలిపారు.ఆయన ఆద్వర్యంలో బుధవారం ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. గంజాయి కేసుల్లో అరెస్ట్ అయ్యి కోర్టు ద్వారా శిక్ష పొందిన నలుగురు వ్యక్తులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి చేత మొక్కలు నాటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని, గత తప్పిదాలను పునరావృతం చేయకుండా సమాజానికి ఉపయోగపడే మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, జీవితంలో సానుకూల మార్పుకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంజాయి లీగల్ టీం అధికారులు అదనపు ఎస్పీ (ఏఆర్) బొంగోని సదానందం, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ములుగు సీఐ దారం సురేష్, ఆర్ ఐ అడ్మిన్ రాధారపు స్వామి, ములుగు ఎస్ఐ ఉపేందర్, పీఎస్ఐ బుట్ట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా పోలీసు శాఖ సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
