Warangal Weavers Protest
* చేనేత కార్మికుల బతుకులు ఆగం చేయవద్దు- రిటైర్డ్ IAS ఆఫీసర్ చిరంజీవి
అకేరు న్యూస్, వరంగల్ : చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వస్త్రాల ఆర్డర్లను నేరుగా ‘టెస్కో’ (TESCO) సంస్థకు ఇవ్వాలని కోరుతు ధర్నా బాట పట్టిన చేనేత కార్మికులకు సంఘీభావ తెలిపారు మాజీ IAS చిరంజీవులు. ప్రైవేట్ టెండర్ విధానం మానుకొవాలని కోరుతు కులవృత్తిని నమ్ముకున్న అనేక కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
అదేవిధంగా గతంలో గత ప్రభుత్వాలు హామీ ఇచ్చిన ప్రకారం 50 శాతం నూలు సబ్సిడీని నగదు బదిలీ ద్వారా నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు… అంతేకాకుండా కుల వృత్తులకు సహకారం చేసే విధంగా అన్ని ప్రభుత్వాలు పనిచేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా కులవృత్తులపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ పద్ధతిని వెంటనే మానుకోవాలంటూ హెచ్చరించారు ఆయన.
ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన వరంగల్ కొత్తవాడ ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
