PAWAN KALYAN OG 2 UPDATE
* పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
ఆకేరు న్యూస్, డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ 2’ (OG 2)పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ‘దే కాల్ హిమ్ ఓజీ’ (THEY CALL HIM OG) ఘన విజయం సాధించిన తర్వాత రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆ దిశగా అధికారిక సంకేతాలు లభించాయి.
* ‘ఓజీ 2’ చర్చలు త్వరలోనే
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “వాగ్దానం చేసినట్లే ఆయన చేస్తున్నారు. ఎప్పుడనేది ఆయనే చెబుతారు. దర్శకుడు సుజీత్ (Director Sujeeth) విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభమవుతాయి” అని పేర్కొంది. దీంతో ‘ఓజీ 2’ (OG 2) ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026
* OG తో బ్లాక్‌బస్టర్
గత ఏడాది విడుదలైన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా దర్శకుడు సుజీత్ చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో వదిలిన కొన్ని ప్రశ్నలు, క్లైమాక్స్‌లో ఇచ్చిన సూచనలు రెండో భాగంపై అంచనాలు పెంచాయి.
* ప్రీక్వెల్ లేదా సీక్వెల్?
‘ఓజీ’ విడుదల సమయంలోనే ఈ కథకు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉండే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ నాని హీరోగా రూపొందిస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ‘ఓజీ’ విశ్వాన్ని మరింత విస్తరించే కొత్త చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘ఓజీ 2’ పై వచ్చిన తాజా సంకేతం మాత్రం పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
