India A vs Afghanistan A ODI TRI NATION SERIES
ఆకేరు న్యూస్, డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా-ఏ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ స్కోరు చేసినప్పటికీ వర్షం కారణంగా డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్-ఏ చేతిలో 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
* బ్యాటింగ్‌లో మెరిసిన భారత యువ ఆటగాళ్లు
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ 49 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, తిలక్ వర్మ 66, రుతురాజ్ గైక్వాడ్ 66 పరుగులు చేశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 44 పరుగులతో ఆకట్టుకున్నాడు.
* ఆఫ్ఘన్ బ్యాటర్ల కౌంటర్ అటాక్
వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-ఏ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంగా ఆడారు.
ఇమ్రాన్ 75, బహిర్ షా 51 పరుగులతో అజేయంగా నిలిచి మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.
Afghanistan A won by 4 runs (DLS Method).
India A will now shift focus towards their next fixture in the #TriNationSeries.
Scorecard ▶️ https://t.co/dMNsGrzIOD#INDAvAFGA pic.twitter.com/XDa1P3tNMg
— BCCI (@BCCI) June 11, 2026
* వర్షం.. భారత్‌కు విలన్
25.5 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు అంతరాయం కలిగించింది. ఆ సమయానికి ఆఫ్ఘనిస్తాన్-ఏ 177/2తో నిలిచింది.
డక్‌వర్త్-లూయిస్ లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు 4 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. భారీ స్కోరు చేసినప్పటికీ ఇండియా-ఏ ఖాతాలో మాత్రం నిరాశే మిగిలింది.
