Women Financial Empowerment Thatikonda
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పడు, సహకారంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని సర్పంచ్ మారపాక సుజనా శ్రీనివాస్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్పు’ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ సీడ్స్ పెస్టిసైడ్స్ షాపును గ్రామ సర్పంచ్ మారపాక సుజనా శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు.
వివిధ వ్యాపార రంగాలలో మహిళలు రాణించాలన్న లక్ష్యంలో భాగంగా స్పందన గ్రామైక్య సంఘం వారి ఆధ్వర్యంలో మహిళా శక్తి రైతు సేవ కేంద్రం స్పందన మ్యాక్స్ క్రెడిట్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఫర్టిలైజర్ సీడ్స్ పెస్టిసైడ్స్ ఎంటర్పైజెస్ షాపును గ్రామంలో ప్రారంభించినట్లు తెలిపారు.
ఎమ్మెస్ అధ్యక్షురాలు బేతి మంజుల, సిసి సహదేవ్, వార్డు సభ్యురాలు దుబ్బాక నవ్య, సీఏ అక్కనపల్లి సరిత, స్ఫూర్తి మహిళా సంఘం సభ్యులు రమ్య, నికిత, అంజలి, భవాని, మంజుల, మల్లమ్మ, లక్ష్మి వివోఏలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
