BJP Swachh School Programme Kamalapur
* కమలాపూర్‌లో బీజేపీ శ్రేణుల స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
నరేంద్ర మోదీ 12 ఏండ్ల పాలన సందర్భంగా మండల వ్యాప్తంగా బిజెపి శ్రేణులు మన బడి – మన బాధ్యత లో భాగంగా శనివారం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని కమలాపూర్, ఉప్పల్, భీంపల్లి, అంబాల, మాదన్నపేట, పంగిడిపల్లి, మర్రిపెల్లి గూడెం, శనిగరం, శంభునిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాఠశాల ఆవరణలను, పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన విధంగా పారవేసే చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈనెల16న కమలాపూర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బడి ఈడు పిల్లల్ని ప్రభుత్వబడిలో చేర్పించే విధంగా కార్యకర్తలందరూ ర్యాలీని చేపట్టనున్నారు.


