RAM CHARAN - UPASANA DAUGHTER KLIN KAARA VIRAL POST
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మెగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు. గత మూడేళ్లుగా మీడియా కంటికి పడకుండా దాచి ఉంచిన తమ ముద్దుల కుమార్తె క్లింకార ముఖాన్ని తొలిసారిగా అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవాళ (జూన్ 20) క్లింకార పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులు సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫోటోను పంచుకున్నారు. ఇందులో క్లింకారను ఎత్తుకుని ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు.
* మూడేళ్ల నిరీక్షణకు తెర..
జూన్ 20, 2023న జన్మించిన క్లింకార ముఖాన్ని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు పాప ఫోటోలు షేర్ చేసినప్పటికీ, ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, నేడు చిన్నారి పుట్టినరోజు కావడంతో అభిమానుల కోరికను తీరుస్తూ నేరుగా క్లింకార ఫేస్ రివీల్ చేసేశారు.
“మా జీవితాల్లోకి ఎంతో సంతోషాన్ని తెచ్చిన మా ముద్దుల పాపాయ్ క్లింకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ ఫోటో కింద పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
* మెగా ప్రిన్సెస్ క్యూట్ లుక్..
ఈ ఫోటోలో బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుని క్లింకార నవ్వుతున్న తీరు ఎంతో క్యూట్‌గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అచ్చం తండ్రి రామ్ చరణ్ పోలికలే వచ్చాయి అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
