station ghanpur Corporate School Fee Exploitation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
కార్పొరేట్ పాఠశాలల పేరుతో కొన్ని పాఠశాల విద్యా దోపిడీ పాల్పడుతున్నప్పటికీ విద్యాధికారులు సహకరిస్తున్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐలు ఆరోపించాయి. శనివారం వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో శివునిపల్లిలోని శ్రీచైతన్య పాఠశాల ను సందర్శించారు.
ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎండి యునుస్, పస్తం పృథ్విరాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ మాట్లాడుతూ స్టేషన్ ఘన్ పూర్ లో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగోడుగుల్లా వెలుస్తున్నాయి అన్నారు. కనీస అనుమతులు, కనీస వసతులు లేకుండా కార్పొరేట్ పేరుతో యాద్దెచ్చగా పాఠశాలలను తెరుస్తున్నారని (CBSE) పర్మిషన్ లేకుండానే CBSE అంటూ ప్రచారం చేసుకొని అడ్మిషన్స్ తీసుకుంటున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు.
శ్రీచైతన్య అని ఫేక్ పేరుతో పాఠశాలను తెరిచి అమాయక తల్లితండ్రుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసి వాళ్ళ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా తల్లితండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తమ పిల్లల్ని పాఠశాల లో జాయిన్ చేయాలనీ కోరారు. పర్మిషన్ లేని స్కూల్ లలో చేర్పించి వారి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నీరటి సంతోష్, బుస్సా రోహిత్, తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకులు భాషాకర్ల మణీత్ రాజ్, రాకేష్, బానోత్ సంతోష్, ఎన్ఎస్ యూఐ నాయకులు జానీబాబా, బిఆర్ఎస్వి నాయకులు లకావత్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
