MEO Buchaiah Government Schools
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య:M E O బుచ్చయ్య
మొదటి రోజే పాఠ్య , పుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ
తొర్రూర్ (ఆకేరు న్యూస్)
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయికి దీటుగా అన్ని వసతులతో పాటు అత్యంత నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని మండల విద్యాశాఖ అధికారి (MEO) బుచ్చయ్య స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆకేరు న్యూస్ తో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను, ఈ విద్యాసంవత్సరం చేసిన ఏర్పాట్లను వివరించారు ఉచిత వసతులు.. నిరుపేదలకు వరం!
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. వీటితో పాటు విద్యార్థులకు:
ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ మరియు
ఉచితంగా స్కూల్ దుస్తులు (యూనిఫాంలు)
రుచికరమైన మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు.
నిరుపేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ముఖ్య ఆశయమని ఆయన పేర్కొన్నారు.
* మండలంలో విద్యా వసతుల వివరాలు
ఇంగ్లీష్ మీడియం బోధన ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మండలంలోని 11 ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియం బోధనను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ వెల్లడించారు. స్కూల్స్ ఓపెనింగ్ రోజే అన్నీ సిద్ధం..
మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగినన్ని తరగతి గదులు, తాగునీరు, టాయిలెట్స్ వసతులను సిద్ధం చేశామని బుచ్చయ్య తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు, అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్స్లో సైతం విద్యార్థుల విద్యాబోధనకు, భోజన వసతులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
* బడిబాట’తో పెరిగిన అడ్మిషన్లు
మండలంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను వివరించారని, బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించేలా అవగాహన కల్పించామని తెలిపారు. ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు కావాలి!
మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు (Boundary Walls) లేకపోవడం వల్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని ఎంఈఓ బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడలు లేనటువంటి పాఠశాలలను గుర్తించి, వాటి చుట్టూ రక్షణ గోడలు నిర్మించడానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
