NIMS Jobs 2026 Notification
* రూ.80 వేల వరకు జీతం!
ఆకేరు న్యూస్, డెస్క్:
ప్రభుత్వ వైద్య రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు హైదరాబాద్ నిమ్స్ (NIMS) గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), సనత్‌నగర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
* ఏ పోస్టులు ఉన్నాయి?
మొత్తం 122 ఖాళీల్లో.. 98 టెక్నీషియన్ పోస్టులు, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి.
ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ఎక్స్-రే/సీ-ఆర్మ్ టెక్నీషియన్, MRI, ECG, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్ పోస్టులతో పాటు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్, హెల్త్ ఇన్స్పెక్టర్ తదితర పరిపాలనా పోస్టులు ఉన్నాయి.
* అర్హతలు ఏమిటి?
టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా నిర్దిష్ట టెక్నికల్ అర్హతలతో పాటు అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ అర్హతలు, సంబంధిత అనుభవం అవసరం.
టెక్నికల్, అలైడ్ సర్వీసెస్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
* జీతం ఎంత?
టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.32,500 వేతనం అందించనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు పోస్టును బట్టి నెలకు రూ.35 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనం లభించనుంది.
* ఎంపిక ఎలా?
దరఖాస్తుల సంఖ్యను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తక్కువ దరఖాస్తులు వస్తే నేరుగా ఇంటర్వ్యూ, ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్క్రీనింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
* దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులను 2026 జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
