Warangal bhadrakali temple BJP Police Clash
అకేరు న్యూస్ వరంగల్ : భద్రకాళీ దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ భూముల వేలంకు సంబందించిన అంశం ఇపుడు వరంగల్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. నిన్న కాంగ్రెస్, బి ఆర్ఎస్ నేతలు తడి బట్టలతో రావడానికి వ్యతిరేకిస్తూ నేడు ఆలయం సంప్రోక్షణ చేయడానికి వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలకు పోలీసులకు తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకొని బీజేపీ నేతలను అరెస్టు చేశారు. ప్రస్తుతం భద్రకాళి దేవాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.భూముల వేలంలో అక్రమాలు జరిగాయని బీఆర్ ఎస్ నాయకులు ఆరోపిస్తూ భద్రకాళీ దేవాలయానికి చేరుకున్నారు.. తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నామని కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి ప్రకటించారు.. పోలీసులు బీఆర్ ఎస్ నాయకులను అక్కడినుంచి పంపించడానికి ప్రయత్నం చేశారు.
బీఆర్ ఎస్ నాయకులకు పోలీసులకు మద్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు యాదవరెడ్డితో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడకు కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి అద్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తాము నిజాయితీగా ఎలాంటి అవకతవకలు లేకుండా భూముల వేలం కార్యక్రమం నిర్వహించామన్నారు.. అనంతరం పోలీసులు కలగజేసుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు..
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
