Rapido Workers Protest Hanamkonda
Published:
Updated: 04 Jul 2026 • 01:48 PM
* రాపిడో దిష్టిబొమ్మ దహనం
ఆకేరు న్యూస్, హన్మకొండ: ఆన్లైన్ అగ్రిగేటర్ సంస్థలు వెంటనే రేట్ కార్డులను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సంస్థల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాపిడో సీఈఓ, కో-ఫౌండర్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రమకు తగ్గ న్యాయమైన రేట్లు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మికులు హెచ్చరించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
