Journalists Memorandum Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక జర్నలిస్టులు సోమవారం స్టేషన్ ఘన్ పూర్ ఆర్డిఓ కిరణ్ ప్రకాష్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ వివిధ పత్రికలు, వివిధ చానల్స్, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చిన వారిలో అక్కనపల్లి అంజయ్య, ఉబ్బని మల్లేశం, చిలగాని విజయ్, మారపాక శ్రీనివాస్, బోసు శివ తదితరులు ఉన్నారు.
