భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బెయిల్
* భూ కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన హేమంత్ సోరెన్
ఆకేరు న్యూస్ డెస్క్ : భూ కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren0) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరిలో సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం ఉదయం జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయల్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ లావాదేవీలు, నకిలీ పత్రాలతో రికార్డులను తారుమారు చేసి, కోట్లాది రూపాయల భూమిని స్వాధీనం చేసుకునేందుకు పథకాన్ని రూపొందించినట్లు ఇడి ఆరోపించింది. ఈడీ అరెస్టుకు కొన్ని గంటల ముందు సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
