Warangal BIS Gold Raid
* రూ. 10 కోట్ల బంగారం సీజ్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలోని బంగారు ఆభరణాల దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న పలు దుకాణాలపై దాడులు చేసి, సుమారు రూ.10 కోట్ల విలువైన 8 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
* హాల్‌మార్క్ లేకపోవడమే కారణం..
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా BIS అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ విచారణలో పలు దుకాణదారులు తప్పనిసరి అయిన ‘హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిటీ (HUID)’ నంబర్ లేకుండానే బంగారాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
* కఠిన చర్యలు తప్పవు..
హాల్ మార్కింగ్ నిబంధనలు పాటించకుండా నకిలీ లేదా ప్రమాణాలు లేని ఆభరణాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా BIS హాల్‌మార్క్ మరియు HUID నంబర్‌ను సరిచూసుకోవాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
