TGTRANSCO ACB Raids Hyderabad
* భారీగా ఆస్తులు గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో (TGTRANSCO) డీఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) ముత్యం వెంకటరమణ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు.
* ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు…
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ నేతృత్వంలో మొత్తం 8 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని ‘మీనాక్షి స్కైట్ టవర్స్’ లో ఉన్న డీఈ వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
* కీలక పత్రాలు, నగదు స్వాధీనం…
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో అధికారులు పలు కీలకమైన ఆస్తి పత్రాలు, భవనాల రిజిస్ట్రేషన్ కాగితాలు, పెద్దమొత్తంలో నగదు మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వెంకటరమణకు చెందిన పలు బ్యాంక్ లాకర్లు, బెనామీ ఆస్తులకు సంబంధించిన ఆధారాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. సోదాలు పూర్తయిన తర్వాత లభించిన ఆస్తుల పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
