CONGRESS PROTEST AT PARLIAMENT
* నల్ల దుస్తులతో ఎంపీల వినూత్న ఆందోళన
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
ఎంపీలంతా నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
దేశంలో తీవ్రమవుతున్న విద్యార్థుల సమస్యలు, పరీక్షల నిర్వహణ లోపాలపై ఉభయసభల్లో వెంటనే పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
కేంద్రం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
