Revanth Rahul Protest Rally
Published:
ఆకేరు న్యూస్, కొడంగల్:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి నడిచారు.
కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేశాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
