Mulugu Hostels Inspection Drive
* ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో (హాస్టల్స్) విద్యార్థులకు నిత్యం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి
– రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య .
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని పలు సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మికంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య , స్పెషల్ ఆఫీసర్ డీపీవో వెంకటయ్యలతో కలిసి బుధవారం సందర్శించారు. పాఠశాలు, హాస్టల్ లలో తనిఖీ నిర్వహించి అందుకు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆయన బ్రేక్ఫాస్ట్ చేశారు. సంక్షేమ హాస్టల్ లో పరిసరాల పరిశుభ్రతను, వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, వార్డెన్లు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వార్డెన్లను ఆదేశించారు. భోజన నాణ్యత లో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
