Jayamukhi Students Protest Exams
Published:
* జయముఖి కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన
* పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని జయముఖి ఇంజినీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసనలో భాగంగా కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. యాజమాన్యం వెంటనే స్పందించి, సెమిస్టర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
