Delhi Metro Stations Closed
ఆకేరు న్యూస్, డెస్క్: రాజధానిలో రాజకీయం వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనలు, ఆందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భద్రతను తీవ్రతరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 7:30 గంటల నుంచే ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 16 కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.
ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మొహరించారు. నిరసనకారులు పార్లమెంట్ వైపు రాకుండా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించారు. అయితే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపళంగా స్టేషన్లను మూసివేయడంతో ఉదయాన్నే విధులకు, కళాశాలలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాకే స్టేషన్లను మళ్లీ తెరిచే అవకాశముంది.
