Priyanka Gandhi
* విద్యార్థుల డిమాండ్లను అంగీకరిస్తేనే సమస్యకు పరిష్కారం – ప్రియాంక గాంధీ
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత పరిణామాలతో విద్యా వ్యవస్థపై విద్యార్థులు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు లేవనెత్తుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రధాని మోడీ స్వయంగా వినాలని సూచించారు. వారి సమస్యలను, కోరికలను అంగీకరించినప్పుడే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రియాంక స్పష్టం చేశారు.
