Mahabubabad Teacher Heart Attack
Published:
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి జడ్పీ హైస్కూల్లో గణిత స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వజ్రకుమారి (45) గుండెపోటుతో కన్నుమూశారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
వజ్రకుమారి ఆకస్మిక మృతి పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
