COLLECTOR SATYA SHARADA RHTC Inspection
ఆకేరు న్యూస్,ఖానాపూర్:
వరంగల్ జిల్లా ఖానాపూర్లోని గ్రామీణ ఆరోగ్య, శిక్షణ కేంద్రాన్ని (RHTC – Rural Health Training Centre) జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు వైద్య సిబ్బంది పనితీరును జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేంద్రంలోని రికార్డులను, పలు విభాగాల నిర్వహణను తనిఖీ చేసి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించకూడదని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
