Warangal Youth Murder Case
* మృతుడు మాడ అనిల్
* బీఆర్ నగర్ నివాసి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ లో దారుణం జరగింది. మాడ అనిల్ ( 22 )అనే యువకుడు దారున హత్యకు గురయ్యాడు.. వరంగల్ నగరంలో ని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు గుట్ట సమీపంలోని బీఆర్ నగర్‌కు చెందిన మాడ అనిల్ ను శనివారం అదే ప్రాంతానికి చెందిన మహేశ్ అనే యువకుడు గొంతుకోసి హత్య చేశాడు. స్థానికులు కథనం ప్రకారం గతంలో ఈ ఇద్దరి మద్య పాత కక్షలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండేళ్ళ క్రితం మహేశ్ మీద హత్యా యత్నం జరిగింది.ఈ దాడిలో మృతుడు అనిల్ ఉన్నాడని మహేశ్ కక్ష పెంచుకున్నాడు.. ఇలాంటి ముప్పు ఉంటుందని భావించి అనిల్ అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బోనాల పండుగ కోసం అనిల్ బీఆర్ నగర్‌కు రావడంతో ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం ఎదురుచూస్తున్న మహేశ్ ఆకస్మికంగా దాడి చేశాడని అంటున్నారు.. గొంతు కోయడంతో అక్కడికక్కడే అనిల్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది..సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హత్యకు పాత కక్షలే కారణమా ఇతర రాజకీయ కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. హత్యకు కారకులైన వారికోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. కాగా అనిల్ హత్యకు గురయిన సమాచారం అందుకున్న బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బోరున విలపించారు..
———————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
