Kukatpally Road Accident
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను మహేష్ (17), లక్ష్మీ తేజ (16) గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పరిశీలించడంతో పాటు, ఘటన తర్వాత పరారైన టిప్పర్ లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
