Bhadrachalam Godavari Water Level
* భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ఆకేరు న్యూస్, భద్రాచలం:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని హెచ్చరించారు.
