Ram Pothineni - Samyuktha New Movie
* బర్త్ డే విషెస్ తో ఖరారు చేసిన మూవీ టీం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథతో రామ్ కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. లోన్ వుల్ఫ్ టైటిల్ పరిశీలనలో ఉంది.
* హీరోయిన్ గా సంయుక్తకు ఛాన్స్..
ఈ ప్రాజెక్ట్‌లో మొన్నటి వరకు కథానాయికగా సంయుక్త పేరు వినిపించింది. ఇప్పుడు చిత్రబృందం సంయుక్త బర్త్ డే సందర్భంగా ప్రాజెక్టులోకి ఆహ్వానించి ఖరారు చేసింది.
* కొత్త జానర్లను యత్నిస్తున్న రామ్
రామ్ పోతినేని కమర్షియల్ సినిమాలతోపాటు కొత్త జానర్లను ప్రయత్నించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తే రామ్‌ను సరికొత్త కోణంలో చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది. ఈ సినిమాలో సంయుక్త పాత్రకు కథలో కీలక ప్రాధాన్యం ఉండనున్నట్ల సమాచారం. సాధారణ హీరోయిన్ పాత్రకు భిన్నంగా సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ముడిపడిన పాత్రలో ఆమె కనిపిస్తే సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.
* రీసెంట్ గా నటించిన చిత్రాలు..
అఖండ 2: తాండవం సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త నటించింది. నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సంయుక్త దియా కాకర్ల పాత్రలో కనిపించింది. రామ్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా : మహేష్ పి. దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబర్ 27న విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. తాన స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పూర్తి కాగానే దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తారని తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
