NEET Student Suicide Attempt
Published:
Updated: 27 Jul 2026 • 12:49 PM
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి:
నీట్ (NEET) పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన పాగే కృష్ణవేణి నీట్ ఫలితాలు చూసుకున్నాక మనస్తాపంతో ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భూపాలపల్లిలోని 100 పడకల జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
