KCR Yashoda Hospital Visit to meet Peddi Sudarshan Reddy
* పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి వెళ్లనున్నారు.
అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. కాగా, ఈ ఉదయమే సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి కేటీఆర్‌తో మాట్లాడి కేసీఆర్ వివరాలు సేకరించారు.
