Kishan Reddy blames BRS and Congress government for Singareni losses
* సింగరేణి నష్టాలకు BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం -కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా విధానాలను కొనసాగిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల (బకాయిలు) బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, బకాయిలు చెల్లించకపోవడం వల్లే తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి ఆర్థికంగా బలహీనపడుతోందని ఆరోపించారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
