TNGOs Membership Drive 2026
ఆకేరు న్యూస్, హాసన్ పర్తి:
టిఎన్జిఓస్ (TNGOs) యూనియన్ హాసన్ పర్తి యూనిట్ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, ఇరిగేషన్ ఫోరం అధ్యక్షులు ఆకుల రాజమౌలి అధ్యక్షతన 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా టిఎన్జిఓస్ యూనియన్ అధ్యక్షులు మరియు జెఏసి (JAC) చైర్మన్ ఆకుల రాజేందర్,టీ ఎన్ జీ ఓ ఎస్ హన్మకొండ జిల్లా సెక్రటరీ బైరి (కత్తి)సోమయ్య తో కలిసి సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు.
* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమంలోనూ, ఉద్యోగుల హక్కుల పోరాటంలోనూ టిఎన్జిఓస్ యూనియన్ ఎల్లప్పుడూ ముందుపీఠిన నిలిచింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ డిఏ (DA)లు, పిఆర్సి (PRC) అమలు, సీపీఎస్ (CPS) రద్దు మరియు ఇతర హెల్త్ కార్డ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మన ఐక్యతే ఆయుధం. యూనిట్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నాయకులు, సభ్యులు సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం యూనిట్ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ మరియు ఇరిగేషన్ ఫోరం అధ్యక్షులు ఆకుల రాజమౌలి మాట్లాడుతూ…టీ ఎన్ జీ ఓ ఎస్ యూనియన్ హసన్ పర్తి యూనిట్ పరిధిలోని ఉద్యోగులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవాలని, హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్, సహాయ అధ్యక్షులు వేణుగోపాల్ కోశాధికారి రాజేష్, కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు రాము నాయక్, మిషన్ భగీరథ ఫోరం బాధ్యులు అనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ బాధ్యులు రాజమౌళి, శ్రీనివాస్, వంశీ, ప్రణయ్, పృద్వి, మహబూబ్, మిషిన్ భగీరథ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు
