Top Maoist Leader Mishir Besra Arrested in Jharkhand
* సీఆర్పీఎఫ్, కోబ్రా ఆపరేషన్
* గణపతి తర్వాత మిగిలిన అగ్రనేత ఆయనే..
* జార్ఖండ్ లో 16 మంది మావోయిస్ట్‌ల లొంగుబాటు
ఆకేరు న్యూస్, డెస్క్ : మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మిశిర్ బెస్రా జార్ఖండ్ లోని దన్ బాద్ జిల్లాలో పోలీస్ బలగాలు మంగళవారం అరెస్ట్ చేశాయి. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారులను ఉటంకిస్తూ వార్తా పత్రికలు కథనాలు రాశాయి. సీపీఐ మావోయిస్ట్ పార్టీ లో మిగిలిన ఇద్దరు అగ్రనేతల్లో మిశిర్ బెస్రా ఒకరు. ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి తర్వాత మిశిర్ బెస్రా మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు.. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఇప్పటి వరకు గణపతి జాడ మాత్రం తెలియ రాలేదు. జార్ఖండ్ కేంద్రంగా మిశిర్ బెస్రా కొంత కాలంగా మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మిశిర్ బెస్రా మీద కోటి రూపాయల రివార్డ్ ప్రకటించింది. మిశిర్ బెస్రా లక్ష్యంగా కేంద్ర బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాయి. ఎట్టకేలకు విజయం సాధించాయి. బెస్రా అరెస్ట్‌కు ముందే జార్ఖండ్‌కు చెందిన 16 మావోయిస్ట్‌లు జార్ఖండ్ పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకనాయకుడిగా మిశిర్ బెస్రాకు పేరున్నది. మావోయిస్ట్ పార్టీ నాయకులు ఎన్ కౌంటర్లో చనిపోవడం, పోలీసుల ముందు లొంగిపోవడం లాంటి పరిణామాల మద్య బెస్రా మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాడు.
—————————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
