ICC has announced a new format for the 2027 ODI World Cup
* 14 జట్లతో వన్డే ప్రపంచకప్ 2027
* దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యం
* 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు
ఆకేరు న్యూస్, డెస్క్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 కోసం సరికొత్త ఫార్మాట్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు, 57 మ్యాచ్‌లు, 12 వేదికలు ఉండనున్నాయి.
గత రెండు ప్రపంచకప్‌లతో పోలిస్తే ఈసారి పోటీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ‘సూపర్ 7’ అనే కొత్త దశను ప్రవేశపెట్టింది.
* టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
మొదటగా అత్యల్ప ర్యాంక్‌లో ఉన్న మూడు జట్లు ‘సూపర్ సిరీస్’ ఆడతాయి. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన ఒక జట్టు మాత్రమే ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా (ఆరేసి జట్లు) విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో తలపడుతుంది. ఈ దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి.
గ్రూప్ దశ ముగిసిన తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-3 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. వాటితో పాటు రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన రికార్డు ఉన్న మరో జట్టు కలిపి మొత్తం 7 జట్లు ‘సూపర్ 7’ దశకు చేరుకుంటాయి.
* సెమీస్‌కు ఎలా చేరుకుంటారు?
సూపర్ 7లో ప్రతి జట్టు మిగతా జట్లతో తలపడుతుంది. ఈ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. P1 vs P4, P2 vs P3 మధ్య సెమీస్ జరుగుతాయి. విజేతలు ఫైనల్లో తలపడి ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీ పడతారు.
* 12 వేదికల్లో 57 మ్యాచ్‌లు
ఈ ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియాలో 1 వేదికను ఎంపిక చేశారు. మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2003 తర్వాత మళ్లీ ఆఫ్రికా ఖండంలో వన్డే ప్రపంచకప్ నిర్వహించబడటం విశేషం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
