Rangu Murali Goud Mother Death
ఆకేరు న్యూస్, పెద్దవంగర :
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు మరియు కొరిపెల్లి గ్రామ సర్పంచ్ రంగు మురళి గౌడ్, మాతృమూర్తి రంగు వినోద మృతి చెందడంతో కొరిపల్లి గ్రామంతో పాటు మండలం అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి.
మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రంగు వినోద అంతిమ సంస్కారాలు అత్యంత అశ్రునయనాల మధ్య ముగిసాయి. ఈ అంతిమ యాత్రలో నియోజకవర్గ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, గ్రామ పంచాయతీ సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న మురళి గౌడ్ కి తల్లి లేని లోటు తీర్చలేనిదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మురళి గౌడ్ ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొని అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
