DCP Mahindra Naik Jangaon Illegal Abortion Case
* కఠిన చర్యలు తీసుకుంటాం
– జనగామ డీసీపీ
జనగామ జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాల కేసును పోలీసులు ఛేదించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ వైద్య కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జనగామ డీసీపీ మహేంద్ర నాయక్ హెచ్చరించారు.
* కఠిన చర్యలు తీసుకుంటాం
బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జనగామ పోలీసులు… ఆర్ ఎంపీ గట్టు శ్రావణ్ కుమార్ , గుండి అనసూయ, మల్లంపల్లి కళ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. గర్భిణికి అక్రమంగా లింగ నిర్ధారణ చేసి, ఆడ శిశువు అని చెప్పి గర్భస్రావం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి గర్భస్రావానికి ఉపయోగించిన క్యాథెటర్ను స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. అక్రమ వైద్య కార్యకలాపాలు, లింగ నిర్ధారణ, చట్టవిరుద్ధ గర్భస్రావాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జనగామ జిల్లా డిసిపి మహేంద్ర నాయక్ హెచ్చరించారు.
—–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
