Sri Rama Hrudaya Sparsha
* ఉప్పుగల్లులో శ్రీరామ హృదయ స్పర్శ అక్షింతల సేకరణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో శ్రీరామ హృదయ స్పర్శ అక్షింతల సేకరణ ఆదివారం జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి 70 వ తిరునక్షత్ర ప్రయుక్త శ్రీరామ హృదయం (జన్మదిన) సందర్బంగా శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం (ముచ్చింతల) నుండి శ్రీరామ కలశం రాగా శ్రీరామ హృదయ స్పర్శ అక్షింతల సేకరణ గ్రామ సంకీర్తన కార్యక్రమం ఉప్పుగల్లులో స్థానిక బస్టాండు హనుమాన్ల గుడి వద్ద నుండి ప్రారంభమైంది. రామభక్తులు హిందూ బంధువులు గ్రామంలో రామ నామ సంకీర్తన చేస్తూ ఇల్లు ఇల్లు తిరిగి అక్షింతల సేకరించడం జరిగింది.
లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ఉప్పుగల్లు గ్రామ సర్పంచ్ కొడారి సాంబరాజు, ఉపసర్పంచ్ యాట మధుగారు హిందూ మహా సమ్మేళనం అధ్యక్షులు గడ్డం రాజు గ్రామ పురోహితులు ప్రదీప్ శర్మ, ఏడవ వార్డు మెంబరు బైరు సుకన్య పవన్ కుమార్ గౌడ్, 9వ వార్డు మెంబరు నల్లబోయిన నాగరాజు, నూక శ్రీనివాస్ గుప్తా, బైరి వినయ్ కుమార్, రాయల్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రాపాల వినయ్ కుమార్, గట్టు రాజేంద్ర ప్రసాద్, గాదెపాక శ్రీశాంత్, వడ్లకొండ రంజిత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
