తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న కేకే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ (Delhi) కి బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ చీఫ్ ఎంపిక (Selection of PCC chief), చేరికలపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion)ఉండడంతో సాయంత్రంలోగా ఎంపిక పూర్తి చేయనున్నారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (AICC President Kharge) సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు రాజీనామా చేయనున్నారు. రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
