Lions Club Notebook Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ శివుని పల్లి ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు. పూర్వపు జిల్లా గ్రవర్నర్ కేసి జాన్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తుమ్మనపల్లి రవి కిరణ్, ట్రెజరర్ కందగట్ల ఈశ్రీకాంత్ సహకారంతో శివునిపల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాన్ బన్నీ మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతోటి కూడిన విద్యను అభ్యసించాలని, సంస్కారం గల యువతగా దేశ భవిష్యత్తుకు తమ వంతు సహకారం అందించాలని విద్యార్థులకు సూచించారు. క్లబ్ కార్యదర్శి పులి వినయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోశాధికారి కందగట్ల శ్రీకాంత్, పూర్వ అధ్యక్షులు గౌరిశెట్టి అనిల్, కౌడ లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
