పెరుమాండ్ల రామకృష్ణ
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై మతతత్వ రాజకీయాలకు స్థానం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కూకట్పల్లిలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
మంగళవారం కూకట్పల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉండాలనేది నాయకుల ప్రకటనలు నిర్ణయించవని, ప్రజల తీర్పే అంతిమమని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి మతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని రామకృష్ణ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి విద్వేష రాజకీయాలను అంగీకరించరని, ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతారని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి యువత మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఆ దిశగా పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని రామకృష్ణ అన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు సహించరని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

