* ఘట్కేసర్ రైల్వేస్టేష్ వద్ద భయానక దృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైలు ఢీకొట్టడం (A train collision) తో చనిపోయిన ఓ వృద్ధుడి మృతదేహం (Old man’s dead body) ఇంజన్‌కు చిక్కుకుపోయింది. డ్రైవర్ గమనించకపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల వరకూ మృతదేహం రైలుకు వేలాడుతూనే ఉంది. ఘట్కేసర్ (Ghatkesar) వద్ద గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రైలును ఆపిచేయించి మృతదేహాన్ని బయటకు తీశారు. బీబీనగర్ (Bibinagar )- ఘట్కేసర్ (Ghatkesar) రైల్వేస్టేషన్ల (Railway stations) మధ్య గుర్తుతెలియని ఓ వృద్ధుడు పట్టాలు దాటుతుండగా.. వరంగల్ -సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు (Warangal – Secunderabad Passenger Train) ఢీ కొట్టింది. దీంతో ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కుని మృతిచెందాడు. మృతదేహం ఇంజన్‌కు వేలాడుతుండగానే.. రైలు 5 కిలోమీటర్ల వరకు ముందుకు వెళ్లిపోయింది. ఘట్కేసర్ రైల్వేస్టేష్ వద్ద స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
—————————–